భువనగిరి అర్బన్, జూన్10 : భువనగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగడంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడ్డారు.
భూదాన్‌పోచంపల్లి : పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి కెనరా బ్యాంక్ సమీపంలోని రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. అక్కడ వ్యాపార సముదాయాలు ఉండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాజాపేట : మండలంలోని బేగంపేటకు చెందిన మూల సాయిలు పాడి ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. దాని విలువు సుమారు రూ.60 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.