నైరుతి రుతు పవనాల రాకతో నల్లగొండ జిల్లాలో మూడ్రోజుల నుంచి వర్షం కురిసింది. 30 మండలాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా తిరుమలగిరి సాగర్ మండలంలో 69.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
– నీలగిరి, జూన్ 22
యాదగిరిగుట్ట, జూన్ 22 : యాదగిరిగుట్ట పట్టణంతోపాటు మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గురువారం సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలతో కూడిన వర్షంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. గంటపాటు రాకపోకలు స్తంభించాయి. కొండపైన భారీ వర్షం కురువడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కొండకింద పార్కింగ్ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.
అత్యధికంగా 40.8 మిల్లీ లీటర్ల వర్షం..
భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. యాదగిరిగుట్టలో 40.8మిల్లీమీటర్లు అత్యధిక వర్షం కురువగా సగటు వర్షపాతం 5.9 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజాపేటలో 23మిల్లీమీటర్లు, భూదాన్‌పోచంపల్లి 12.8, సంస్థాన్‌నారాయణపూర్ 12.2, గుండాల 9.2, ఆలేరు 8.6, మోత్కూరు 8.4, భువనగిరి 8.2, బీబీనగర్ 6.8, రామన్నపేట 5.8, మోటకొండూరు, ఆత్మకూరు(ఎం) 3.4, వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో 2.6మిల్లీలీటర్ల చొప్పున వర్షం పడింది.
నల్లగొండ జిల్లాలో..
నీలగిరి, జూన్ 22 : నైరుతి రుతుపవనాల కారణంగా జిల్లాలోని 30 మండలాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురువగా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. అత్యధికంగా తిరుమలగిరి(సాగర్)లో 69.8 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, అత్యల్పంగా వేములపల్లి, గట్టుప్పల్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లి 48, నకిరేకల్ 41, నార్కట్‌పల్లి 38.5, నిడమనూరు 37.5, చింతపల్లి 31.3, నల్లగొండ 29.5, మర్రిగూడ 25, త్రిపురారం 25, శాలిగౌరారం 23.5, కట్టంగూర్ 23.5, అనుముల 21.3, కేతేపల్లి 20, పీఏ పల్లి 20, పెద్దవూర 18.8, దామరచర్ల 18.5, తిప్పర్తి 18.3, దేవరకొండ 17.8, చిట్యాల 17.3, మిర్యాలగూడ 16.5, మునుగోడు 14.3, అడవిదేవులపల్లి 10.5, చండూర్ 7.3, కొండమల్లేపల్లి 5.3, చందంపేట 3.8, నేరేడుగొమ్ము 3.8, గుర్రంపోడు 2, గుండ్లపల్లి 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.