అర్వపల్లి ఏప్రిల్ 07 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో పీహెచ్సీ డాక్టర్ భుక్యా నగేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆరోగ్యకరమైన ప్రారంభాలు.. ఆశాజనక భవిష్యత్లు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. గర్భధారణ, ప్రసవానంతర సమయాల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ సేవలను వివరించారు.
అత్యవసర ప్రసూతి సంరక్షణ అలాగే శిశువులకు ప్రత్యేక సంరక్షణ వంటి ప్రాణాలను రక్షించే వనరులు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, ల్యాబ్ టెక్నీషియన్ చొక్కయ్య, నర్సింగ్ ఆఫీసర్ కళమ్మ, గిరిజా, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.