అర్వపల్లి, డిసెంబర్ 7 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసిరుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. 8న శుక్రవారం సాయ ంత్రం అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి గంధాన్ని మండల ప్రజాప్రతినిధులు ఊరేగింపుగా తీసుకొస్తారు. అదే రోజు రాత్రి ఖవ్వాలి నిర్వహిస్తారు. 9న శనివారం దీపారాధన కార్యక్రమాలు నిర్వహణతో ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి. వివిధ రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు, మానసిక ప్రశాంతత లేని వారు ప్రతి శుక్రవారం దర్గా గద్దెపై నిద్రిస్తుంటారు. అలా గే కందూరు పండుగలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
దర్గా సమీపంలో చెలిమె బావి ఉంది. 4ఫీట్ల వెడల్పుతో 150అడుగుల లోతు ఉంటుంది. ఎంత ఎండకాలంలోనూ చెలిమె బావిలో నీరు ఉండడం విశే షం. ఈ నీళ్లతో స్నానం చేయడంతో పాటు తాగితే సర్వ రోగాలు పోతాయని నమ్మకంతో భక్తులు సీసాలో ఇంటికి తీసుకెళ్తుంటారు. దర్గాను పూర్తిగా రాతితో నిర్మించడంతో అన్ని కాలాల్లోనూ చల్లగా ఉండడం ఈ దర్గా ప్రత్యేకత. ఇప్పటికే దర్గాకు రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ముజావర్ సయ్యద్ అలీ తెలిపారు.