మోత్కూరు, ఏప్రిల్ 8 : మండలంలోని దాచారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్‌రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ ఇటీవల మృతి చెందారు. గ్రామంలో మంగళవారం పిచ్చమ్మ చిత్ర పటానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య పూల మాల వేసి నివాళి అర్పించారు.
ధర్మేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్నాథ్, బీఆర్ఎస్ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, కొండ సోంమల్లు, గజ్జి మల్లేశ్, గిరిగాని శ్రీనివాస్, సామ పద్మారెడ్డి, సాదుల నర్సయ్య, పొన్నాల వెంకటేశ్వర్లు, తొట్ల స్వామి యాదవ్, కడమంచి వస్తాద్, అండి రజితారాజిరెడ్డి, శైలజ, అనిత, జ్యోతి, ధనమ్మ ఉన్నారు.