దేవరకొండ, ఫిబ్రవరి 19 : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సంత్ సేవాలాల్ 284వ జయంతి సందర్భంగా పట్టణంలోని బంజార భవన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహానీయుడి అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ పయనించాలని సూచించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గిరిజన గురుకులాలు మంజూరు చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రకటించి నియోజకవర్గాల వారీగా నిధులు మంజూ రు చేశారని కొనియాడారు. గిరిజనులకు రాజ్యాధికారం అందించేందుకు తండాలను పంచాయతీలుగా చేశారన్నారు.
సంత్ సేవాలాల్ మూడు శతాబ్దాల క్రితం నడిచిన నెలలోనే గిరిజన భవన్ నిర్మించారని తెలిపారు. అడవిబిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మికత దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడేందుకు సేవాలాల్ విశేష కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, వంగాల ప్రతాప్‌రెడ్డి, మంచికంటి వెంకటేశ్వర్లు, మాధవరం సునీతాజనార్దన్రావు, జడ్పీటీసీలు మాధవరం దేవేందర్‌రావు, కేతావత్ బాలూనాయక్, రమావత్ పవిత్ర, రైతుబంధు సమితి మండలాధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, కేసాని లింగారెడ్డి, రాజినేని వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ తూం నాగార్జున్‌రెడ్డి, బంజార సంఘం అధ్యక్షుడు కేతావత్ లక్ష్మణ్‌నాయక్, రమావత్ దస్రునాయక్, నేనావత్ రాంబాబునాయక్, వడిత దేవేందర్‌నాయక్, డాక్టర్ రవినాయక్, నేనావత్ కిషన్‌నాయక్, రమావత్ అంజానాయక్, పాండు, పంతులాల్, ధరమ్‌సింగ్, పాండు, పాపనాయక్, అనంతరం గిరిజన విద్యార్థులు నృత్యాలతో అలరింపజేశారు.