చండూరు, డిసెంబర్ 31 : చేనేత కార్మికులు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, పద్మశాలి సమాజం మొత్తం వారి వెంట ఉంటుందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన నేత కార్మికుడు రుణమాఫీ కోసం అప్పు తెచ్చి వడ్డీలు కట్టినా కూడా బ్యాంకర్లు పలు రకాల షరతులు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇక రుణమాఫీ కాదేమోనని ఆందోళన చెంది మంగళవారం ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన రాజ్‌కుమార్ పద్మశాలి సంఘం సభ్యులతో కలిసి బుధవారం చండూరుకు వచ్చి సదరు కార్మికుడిని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీ ఆలస్యమవుతున్న కొద్దీ నేతన్నలు దిక్కుతోచక ఆత్మహత్యల వైపు ముగ్గు చూపున్నారన్నారు.
ప్రభుత్వం తక్షణమే చేనేతల రుణాలు మాఫీ చేయాలని, ఆ విధంగా బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనమాల శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిచర్ల మారుతి, రాష్ట్ర మీడియా విభాగం నాగరాజు, చండూరు చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకటేశం, బొల్ల జనార్ధన్, వర్కాల విజయ్, చెరిపెల్లి రాజు, చెరిపెల్లి నరేశ్, రాములు, చెరిపెల్లి బుచ్చయ్య, రాపోలు రవి, వర్కాల నరేందర్, ఏలే సత్తయ్య, గంజి వెంకటేశం, గజం రాజు, చెరిపెల్లి రాఘవేంద్ర, చెరుపల్లి రఘు, దువ్వ తిరుపతయ్య, దుడుకు సత్యనారాయణ పాల్గొన్నారు.

Chandur : చేనేత కార్మికులు అధైర్య పడొద్దు : వల్లకాటి రాజ్‌కుమార్