కట్టంగూర్, మే 01 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జిల్లా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎం కందాళ రమా అన్నారు. గురువారం పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని హ్యాండ్ బాల్ క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మాట్లాడుతూ 30 మంది బాలికలు, 30 మంది బాలురకు నెల రోజుల పాటు షౌష్టికాహారం అందిస్తూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంమోహన్‌రెడ్డి, నగేశం, సుధాకర్, వెంకన్న, సాయి, శివ, క్రీడాకారులు పాల్గొన్నారు.