చిట్యాల, సెప్టెంబర్ 28 : ప్రభుత్వం కుల సంఘాలకు చేయూత నందిస్తుందని శాసన మండి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాలలో రూ.20 లక్షలతో యాదవ సంఘం భవనం, రూ.20 లక్షలతో గౌడ సంఘం భవనం, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో ఎస్టీ కమ్యూనిటీ హాల్, రూ.10లక్షలతో ఆర్ఎంపీ వైద్యుల యూనియన్ భవన నిర్మాణాలకు గురువారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక వైపు వ్యవసాయ రంగం, రెండో వైపు సంక్షేమ రంగం పారిశ్రామిక రంగం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
పంట పండించడంలో కొనుగోలు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి అగ్రభాగాన ఉంచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మూడోసారి గెలిపించుకోవాలన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక బడగు బలహీన వర్గాలకు గౌరవం లభించిందన్నారు. గొల్ల,కురుములకు హైదరాబాద్‌లో 500 కోట్ల విలువ చేసే ఆత్మగౌరవ భవనాన్ని కట్టించిన గొప్ప నాయకులు కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో నియోజకర్గాన్ని అభివృద్ధిలో ముందుంచడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, సుంకరి యాదగిరి, వనం వెంకటేశ్వర్లు, కర్నాటి ఉప్పల్‌రెడ్డి, దాసరి నర్సింహ, యాదవ సంఘం అధ్యక్షుడు మెండే సైదులు పాల్గొన్నారు.