నకిరేకల్, జులై 10 : శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో “గురు పౌర్ణమి” వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5-15 గంటలకు కాగడ హారతి, 6 నుండి 8 గంటల వరకు సాయినాథుడికి భక్తులచే 108 కలశాలతో పంచామృత అభిషేకములు, అలంకరణ, అష్టోత్తర శతనామావళి, హారతి, దర్శనములు, 9-30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, మధ్యాహ్నాం 12-30 గంటలకు మధ్యాహ్నా హారతి, నైవేధ్యం, తీర్థప్రసాద వితరణ, 1-00 గంటకు సుమారు 2 వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.
విశేషమైన పూజ, భజన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉప్పల వెంకటరమణ, ట్రస్ట్ సభ్యలు తొనుపునూరి శ్రీనివాస్, గట్టు శ్యామసుందర్ , నోముల గోవిందరాజులు, బానాల రాంరెడ్డి, వలిశెట్టి స్వప్న, కందగట్ల మమత, బండారు వేణుగోపాల్, పిల్లమర్రి సునీత, బ్రహ్మదేవర వేణు, దాచేపల్లి శ్రీనివాస్, దేవరశెట్టి మధుసూదన్, జొర్రిగల శ్రీనివాస్, కందగట్ల పవన్, వలిశెట్టి భిక్షం, పిల్లలమర్రి శ్రీనివాస్, దాస పద్మ, కందగట్ల సంతోశ్, కందగట్ల రమా, ట్రస్ట్ సభ్యులు, సేవా కమిటీ సభ్యలు పాల్గొన్నారు.
Nakrekal : షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నకిరేకల్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు