‘గుర్రంపోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’
గ్రురంపోడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ కి ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి మాట్లాడారు.
గుర్రంపోడ్, ఆక్టోబర్ 30 : గ్రురంపోడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ కి ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో గుర్రంపోడు మండలం లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. గుర్రంపోడు మండలంలో రైతులు పంటలు ఎండిపోయి, పంట చేతికి అందక మండలంలో 70 శాతం మంది రైతులు నష్టపోయారన్నారు. వారికి తక్షణమే ఎకరాకు రూ.50 వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ, సర్పంచులు జక్కల స్వప్నభాస్కర్, చెవ్వు రమేష్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు పిల్లి అభినయ్ యాదవ్, సీనియర్ నాయకులు కామల్ల రాములు, షేక్ సిరాజు, కూనూరు సైదిరెడ్డి, కంసాని చంటి, పోలేపల్లి యాదయ్య, వనమాల మహేందర్, బొల్లం నరేశ్, కుందారపు యాదగిరి, రజనీకాంత్, కొండల్ రెడ్డి, గణేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గుర్రంపోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’
Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

