గుర్రంపోడు, ఆగస్టు 21 : సర్పంచుల ఫోరం గుర్రంపోడు మండలాధ్యక్షుడిగా గంగల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మండలంలోని చింతగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గంగల కృష్ణను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా మండలంలోని సర్పంచులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. మండలంలోని గ్రామ పంచాయితీల అభివృద్ధికి కృష్ణ నాయకత్వంలో సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. తనను మండల అధ్యక్షుడిగా ఎకగ్రీవ ఎన్నికున్నందుకు కృష్ణ పలువురికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామాల అభివృద్ధికి, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.