Madhya Pradesh | ‘నో యూపీఐ డే’.. ఎండీఆర్ లెవీపై మధ్యప్రదేశ్ వ్యాపారుల నిరసన
మధ్యప్రదేశ్ వ్యాప్తంగా వ్యాపారులు బుధవారం ‘నో యూపీఐ డే’ను పాటించారు. తమ దుకాణాల్లోని క్యూఆర్ కోడ్లను నల్లని వస్త్రంతో కప్పి నగదు రూపంలో చెల్లించాలని వినియోగదారులను కోరారు. వ్యక్తులు-వ్యాపారుల మధ్య రూ.2 వేలకు పైన జరిగే లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఈ నిరసన చేపట్టారు.
భోపాల్ : మధ్యప్రదేశ్ వ్యాప్తంగా వ్యాపారులు బుధవారం ‘నో యూపీఐ డే’ను పాటించారు. తమ దుకాణాల్లోని క్యూఆర్ కోడ్లను నల్లని వస్త్రంతో కప్పి నగదు రూపంలో చెల్లించాలని వినియోగదారులను కోరారు. వ్యక్తులు-వ్యాపారుల మధ్య రూ.2 వేలకు పైన జరిగే లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఈ నిరసన చేపట్టారు. సుమారు 125 వ్యాపార సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అవి విజ్ఞప్తి చేశాయి. ‘ప్రభుత్వానికి వ్యాపారులు వ్యతిరేకం కాదు.
ఎండీఆర్ నుంచి వసూలు చేసిన డబ్బు ప్రభుత్వ ఖజానాలో జమ కానప్పుడు, వ్యాపారులపై ఈ అదనపు భారం ఎందుకు’ అని జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డు మధ్యప్రదేశ్ ప్రతినిధి రమేశ్ ఖండేల్వాల్ ప్రశ్నించారు. అక్టోబర్ 15లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే యూపీఐ క్యూఆర్ కోడ్ యంత్రాలను నీటి వనరుల్లో పడేస్తామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

