నాగారం, ఫిబ్రవరి 21 : నాగారం మండలం శాంతినగర్ గ్రామంలో మార్చి 23, 24 తేదీల్లో జరిగే బొడ్రాయి పునఃప్రతిష్ఠ, ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్‌ను ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం నేరుగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
పండుగను రాగద్వేషాలు లేకుండా పార్టీలకతీంతగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షేక్ నాగుల్ మీరా, చారి, పొదిల లింగయ్య, సయ్యద్, మల్లెపాక సత్యనారాయణ, హన్మంతు, ఉప సర్పంచ్ శ్రీను, చిప్పలపల్లి చిరంజీవి పాల్గొన్నారు.