సూర్యాపేట, సెప్టెంబర్ 30: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు దసరా పండుగ వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని శ్రీ విఘ్నేశ్వర, శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత కనకదుర్గ ఆలయంతోపాటు చంద్రన్నకుంట దుర్గామాత టైమ్ స్కేర్, సన్ సిటీ కింగ్స్, నెహ్రూ నగర్లో త్రిశూల్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. దాతల సహకారంతో యువత నిష్టగా, ప్రశాంత వాతావరణంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ కౌన్సిలర్లు ఆకుల లవకుశ, బత్తుల జాని, ఎస్కే తాహేర్‌పాషా, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బత్తుల రమేశ్, గాలి సాయి, శ్రీపాది జానకిరాములు, బైరు వెంకన్న ముదిరాజ్, పలు యూత్ కమిటీల సభ్యులు పర్వతపు వెంకటేశ్వరా చారి, జ్యోతి, పృథ్వీ, సాయి గణేశ్, రమేశ్, అవోక్, భాస్కర్, మధు, బాలరాజు, నాగార్జున, ఉదయ్, మహేశ్, రాజబోయిన శ్రీకాంత్, గుంటి సాయి, శ్యాం, భరత్, భార్గవ్, శివ, నజీమ్, రామకృష్ణ, రాహుల్, కార్తిక్, వేను, బత్తుల రాజు, యశ్వంత్, ఆకాశ్, వేణు, గోపి, సాయితేజ, విక్కి, నిఖిల్, మధు, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలోని 19వ వార్డులో భవానీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న, యూత్ సభ్యులు ఎర్ర పృథ్వీరెడ్డి, దారోజు భాగ్యరాజు, గౌస్, మాళోతు రవి, సోమగాని సోమేశ్, కోడి వినయ్, ఎర్ర ప్రశాంత్ రెడ్డి, గోనె రోహిత్, బత్తుల మహజన్, బొప్పని శ్రీకాంత్, మమిడిశెట్టి అంజయ్య, ఎర్ర ఉపేంద్ర, గోగుల విజయ, పుల్లెంల శ్రీలత, బాణోతు కవిత, చైతన్య తదితరులు పాల్గొన్నారు.