గట్టుప్పల్ మార్చ్ 27 : బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దివంగత గుండగోని మైసయ్య గౌడ్ సేవలు మరువలేనివని ఆ పార్టీ గట్టుప్పల్ మండలాధ్యక్షుడు రావుల ఎల్లప్ప అన్నారు. మైసయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మండల పరిధిలోని తెరట్పల్లిలో మైసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మైసయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజలను మమేకం చేయడంలో, ప్రజల మనిషిగా ఆయనకున్న పేరును ఎవరూ చెరపలేరన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరు వీరారెడ్డి, మునుగోడు నియోజకవర్గం కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, జిల్లా కార్యదర్శులు బత్తుల జంగయ్య గౌడ్, చిలువేరు దుర్గయ్య, గట్టుప్పల మండలం, ఆయా గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.