రామగిరి, జూన్ 26 : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డ్రిగీ కళాశాల – చర్లపల్లి, నల్లగొండలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవ్రిత వాణి కర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, బోటని, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టుల్లో 55 శాతం కంటే అధికంగా మార్కులు ఉండి, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 1న కళాశాలలో జరిగే డెమో, ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు టీజీఎస్డబ్ల్యూఆర్డీసీడబ్ల్యూ నల్లగొండ, నిట్స్ కాలేజీ బిల్డింగ్, నమస్తే తెలంగాణ యూనిట్ ఆఫీస్ పక్కన, చర్లపల్లి నల్లగొండలో లేదా 8639109606, 9000229058 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.