తుంగతుర్తి, ఏప్రిల్ 17 : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ లాయర్ గుడిపూడి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ గవర్నర్గా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడిపూడి వెంకటేశ్వరరావును శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గుడిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవ కోసం తాన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాము గౌడ్, గుడిపాటి సైదులు, ఓరుగంటీ శ్రీను, చారి, గుడిపూడి శ్రీనివాసరావు, సైదులు, వెంకటనారాయణ, అభిలాష్, సుభాష్, సంజీవ, గిరి పాల్గొన్నారు.