పచ్చదనం పెంపే భావితరాలకు భద్రమైన భవిష్యత్ : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
పచ్చదనమే భావితరాలకు భద్రమైన భవిష్యత్ అని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన భవిష్యత్ కోసం వాతావరణం- ప్రకృతి ప్రేరణ అనే నివాదంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో...
నీలగిరి, జూన్ 05 : పచ్చదనమే భావితరాలకు భద్రమైన భవిష్యత్ అని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన భవిష్యత్ కోసం వాతావరణం- ప్రకృతి ప్రేరణ అనే నివాదంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణ పర్యావరణ సమతుల్యకి, వాతావరణ మార్పుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన ఫలాలు అందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహద పడుతుందన్నారు. నల్లగొండలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో వృక్షారోపణ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నగరంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపుదల ద్వారా కాలుష్య రహిత, ఆరోగ్యవంతమైన నల్లగొండ నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ హకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం మొహమ్మద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.అశోక్, అసిస్టెంట్ ఇంజినీర్ అసీం బాబా, శానికిురీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, వార్డు అధికారి సి.హెచ్.శృతి, హరితహారం సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఇంజినీరింగ్ విభాగ పిబ్బంది, ఎన్ ఏసీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

