ఆత్మకూర్.ఎస్, నవంబర్ 12 : ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూరు ఐకెపి కేంద్రాన్ని తాసీల్దార్ అమీన్ సింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటా అయిన ధాన్యాన్ని వెంటనే లారీలో లోడ్ చేయాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే తేమ శాతం తక్కువగా ఉండేలా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఆరబెట్టాలని, ధాన్యాన్ని ఎంత ఎక్కువ ఎండబడితే అంత మ్యాచుర్ వచ్చి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తారని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ శివ మూర్తి, సెక్రెటరీ పాల్గొన్నారు.