నల్లగొండ రూరల్, అక్టోబర్ 8 : నల్లగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా పీఏసీఎస్, హాక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఎస్ఓ వెంకటేశ్, డిసిఓ సత్య నాయక్, డీఎం గోపికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యం కాంటా అయిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.
బుధవారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 295 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నామని, రైతుల అవసరాలకు అనుగుణంగా వాటిని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, ఏఓ శ్రీనివాస్, ఏటీఎం వినోద, హాక అధికారి కోటయ్య, ఇన్చార్జి కోటేశ్వర్, పీఏసీఎస్ సీఈఓ కంచర్ల అనంత రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Nalgonda Rural : ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’