– నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల
కట్టంగూర్, ఏప్రిల్ 08 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులా మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని బొల్లెపల్లి, మల్లారం, కల్మెర, మునుకుంటకల, ఈదులూరు, వందనపల్లి నారెగూడెం, పరడ గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఎప్పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పుష్పలత, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం రాములు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, ఆయా గ్రామాల సర్పంచులు జలజ, గుల్లి నరేష్, కుంభం అనిల్ రెడ్డి, కురిమిల్ల మల్లేష్, కొలిపాక సురేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేష్, బండారు కృష్ణ, నాయకులు నంద్యాల వెంకట్ రెడ్డి, గద్దపాటి దానయ్య, మండల సమాఖ్య అధ్యక్షులురాలు అయితగోని ఝూన్సీ, గద్దపాటి రాములు, గడుసు శంకర్ రెడ్డి, ఎర్ర వెంకన్న, కత్తుల శంకర్, అయితగోని నర్సింహ్మ, ఎడ్ల పెద రాములు, అయితగోని నారాయణ, మిట్టపల్లి శివ, రెడ్డిపల్లి స్వామి పాల్గొన్నారు.