రామగిరి, ఏప్రిల్ 04 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్ లో యూపీపీ విద్యార్థులకు శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే అలరించింది. పాఠశాల అధ్యక్షుడు భీమయ్య జగిని, కార్యదర్శి అమరేందర్ రావు, పాఠశాల ప్రిన్సిపాల్ పార్థసారధి విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నల్లగొండ పబ్లిక్ స్కూల్లో అలరించిన గ్రాడ్యుయేషన్ డే