ఉత్సాహంగా రోలర్ స్పీడ్ స్కేటింగ్
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి సూచించారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ పాఠశాలలో తెలంగాణ ఫస్ట్ ర్యాంకింగ్ రోలర్ స్పీడ్ సేటింగ్ను వారు ప్రారంభించారు.
- భువనగిరిలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొన్న 780 మంది..
- రాష్ట్రంలోనే మొట్టమొదటి రోలర్ స్పీడ్ స్కేటింగ్ గ్రౌండ్‌గా గుర్తింపు
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 16 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి సూచించారు. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ పాఠశాలలో తెలంగాణ ఫస్ట్ ర్యాంకింగ్ రోలర్ స్పీడ్ సేటింగ్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులు శారీరకంగా, మానసికంగా పరిపుష్టి సాధిస్తే చదువుపై ఆసక్తి పెరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు, క్రీడలకు పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రం పేరును దశదిశలా చాటి చెప్పాలన్నారు. జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో సేటింగ్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రస్థాయిలో రోలర్ స్పీడ్ సేటింగ్ ప్రథమ స్థానంలో ఉండడం, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వపరంగా రానున్న రోజుల్లో స్కేటింగ్ క్రీడను భువనగిరిలో నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
అంతకుముందు విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి సేటింగ్ గ్రౌండ్‌ను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సేటింగ్ పోటీల్లో 780 మంది విద్యార్థులు పాల్గొన్నారని, మొదటి రోజు సెమీ ఫైనల్స్ పూర్తయినట్లు, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. కార్యక్రమంలో సువాలి ఎస్టేట్ అధినేత, చైర్మన్ పులిమామిడి సుభాష్‌రెడ్డి, న్యూ డైమెన్షన్ పాఠశాల డైరెక్టర్ శివాణి, ఇండియా సేటింగ్ ఫెడరేషన్ చీఫ్ భగీరథ, రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ కొల్పుల అమరేందర్, ప్రిన్సిపాల్ శ్వేతారెడ్డి, కోచ్ రాజు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

