చండూరు, ఏప్రిల్ 05 : యాసంగి సీజన్ ధాన్యం దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, తరుగు మోసాలను అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సీహెచ్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు, హమాలీలకు మంచినీళ్లు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
తరుగు, తూకాల్లో మోసం వంటి సంఘటనల నేపథ్యంలో అధికారులు జాగ్రత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం చండూరు మండల కార్యదర్శి జేరిపోతుల ధనుంజయ, పార్టీ సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, వరికుప్పల ముత్యాలు, ఈరటి వెంకటయ్య, కొత్తపల్లి నరసింహ పాల్గొన్నారు.