రామగిరి, అక్టోబర్ 10 : విద్యలో అంతరాలు పెరిగిపోయాయని, ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి క్రమ క్రమంగా దూరం అవుతున్నాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. యూటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు నాగటి నారాయణ మూడో వర్ధంతి సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యా సామాజిక న్యాయం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యా ద్వారానే అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా సామాజిక అసమానతల రూపుమాస్తాయన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష టెట్ పాస్ కావాలనడం సరైంది కాదన్నారు. విద్యా హక్కు చట్టంలో 23 సవరణను సరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రాష్ట కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, వేదిక అధ్యక్షుడు అంజిరెడ్డి, తెలుగు విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాఫెల్, టాప్రా అధ్యక్షుడు శ్యాంసుందర్, సాహితీ మండలి గౌరవ అధ్యక్షుడు కుకడాల గోవర్ధన్, టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శులు, మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.