కట్టంగూర్, ఏప్రిల్ 23 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి జీవితంలో అభివృద్ధి సాధించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని సూచించారు.
వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులతో పాటు 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొంక అంథోని, అబ్దుల్ గపూర్, చిన్ని శ్రీనివాస్, సునంద, లేజస్విని, పీడీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.