నల్లగొండ : గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి పట్టణంలో కొండమల్లేపల్లి నుంచి పాల్వాయి వరకు రూ.3.55కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొండమల్లేపల్లి నుంచి గౌరికుంట తండా వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి లైట్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కొండమల్లేపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా అని ఆయన తెలిపారు.
పట్టణంలో గ్రంథాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ,ఎంపీపీ దూదిపాల రేకా రెడ్డి, జడ్పీటీసీ పసునూరి సరస్వతమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రు నాయక్, రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, పాల్గొన్నారు