గుండాల, జనవరి 6: సర్కారు పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.45.82 లక్షలు, వెల్మజాల ఉన్నత పాఠశాలలో రూ.41.74 లక్షలతో మన ఊరు-మన బడి కింద చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాలతోపాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, దుస్తులు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నదన్నారు. మన ఊరు-మన బడి కింద చేపట్టే పనులను నాణ్యతతో నిర్మించాలని పీఆర్డీఈ హేమంత్‌కుమార్, ఏఈ దామోదర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీరాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ షర్పొద్దీన్, సర్పంచులు సంగి బాలకృష్ణ, చిందం వరలక్ష్మి, దార సైదులు, ఎంపీటీసీలు పొన్నగాని మహేశ్, సంగి అలివేలు, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ శ్రీధర్ పాల్గొన్నారు.
బునాదిగాని కాల్వ పనుల పరిశీలన
మోత్కూర్ : ఆత్మకూరు(ఎం) మండలానికి తాగునీరు అందిచేందుకు నిర్మిస్తున్న బునాదిగాని కాల్వ పనులను త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. నిలిచిపోయిన కాల్వ పనులను ప్రభుత్వ విప్ సొంత నిధులతో వారం క్రితం ప్రారంభించారు. ఆత్మకూరు(ఎం) మండలంతోపాటు మోటకొండూర్ మండలంలోని సర్వేపల్లి నుంచి నాంచారిపేట వరకు జరుగుతున్న కాల్వ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఆమె వెంట మోటకొండూర్ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఆత్మకూరు(ఎం) బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ, శ్రీనివాస్‌రెడ్డి, అజీమొద్దీన్ ఉన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
ఆలేరు రూరల్ : మండలంలోని కొల్లూరు, శారాజీపేట గ్రామాలకు చెందిన దూడల యాదగిరి, బాకి ఆనందం ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శుక్రవారం పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఆమె వెంట సర్పంచులు కోటగిరి జయమ్మ, బండ పద్మాపర్వతాలు, కొల్లూరు బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జనగాం వెంకటపాపిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, అయిలి కృష్ణ, గాజుల వెంకటేశ్ ఉన్నారు.