ప్రజా ఆశీర్వాద సభకు స్వచ్ఛందంగా తరలిరావాలి
ఈ నెల 29న ఆలేరులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరులో మహిళలలో మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ఆలేరు, అక్టోబర్ 25 : ఈ నెల 29న ఆలేరులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరులో మహిళలలో మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సమావేశంలో ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్, కౌన్సిలర్ మోర్తల సునీతారమణారెడ్డి, మాజీ ఎంపీపీ కసగళ్ల అనసూయ, మాజీ డైరెక్టర్ మొరిగాడి ఇందిర, మందుల విజయ, చిమ్మి భాగ్య, మొరిగాడి సుజాత, బొమ్మెళ్ల రేణుక, చింతకింది రేణుక, ఆలేటి అరుణ, రేణుక, శ్రేయ, రజిత, విజయ, లలిత, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
సభను విజయవంతం చేయాలి
ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగురనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ జల్లి నర్సింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసి సంతోష్, మొరిగాడి వెంకటేశ్, పత్తి వెంకటేశ్, దయ్యాల సంపత్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల ఇన్చార్జి మొగులగాని మల్లేశంగౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, ఉప్పలయ్య, భానుప్రకాశ్, పూర్ణచందర్‌రాజు, దశరథగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సత్తయ్య, శ్రీనివాస్, అజీమొద్దీన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భారీగా తరలిరావాలి
మోటకొండూర్ : సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని సభ మండల ఇన్చార్జి ప్రతికంఠం పూర్ణచందర్‌రాజు, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్పంచులు, గ్రామశాఖల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్, ఎంపీటీసీలు పన్నాల అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, బీఆర్ఎస్వై ప్రధాన కార్యదర్శి పన్నాల నవీన్‌రెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు గౌరయ్య, నాయకులు పాండురంగారెడ్డి, బీరయ్య పాల్గొన్నారు.
రాజాపేట : సీఎం సభకు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌటె లక్ష్మణ్, మదర్ డెయిరీ డైరెక్టర్ అర్కాల గాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కరాటే బాలు, సర్పంచ్‌లు ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, వస్పరి ధనలక్ష్మీవిష్ణు, వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

