‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
రైతులకు వ్యవసాయానికి సరిపడా కరెంటు లేక, కాల్వల ద్వారా సాగునీరు రాక పంట పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
– కరెంట్ చాలక, నీళ్లు రాక ఎండిపోతున్న పంట పొలాలు
– బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు
– బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి, అక్టోబర్ 12 : రైతులకు వ్యవసాయానికి సరిపడా కరెంటు లేక, కాల్వల ద్వారా సాగునీరు రాక పంట పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వానకాలం పంటలు కాపాడే చర్యలు చేపట్టక పోను యాసంగి పంటకు కరెంట్, నీళ్లు, ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. తుంగతుర్తి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఇటీవల పత్రిక సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ రైతుల పంట పొలాలు ఎండిపోలేదని కావాలనే ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారా అనడం సిగ్గుచేటు అన్నారు.
అయ్యా మందుల సామేల్ తుంగతుర్తిలోని ఏ గ్రామానికి వెళ్దామో రండి నీళ్లు లేక కరెంటు సకాలంలో రాక పంట పొలాలు ఎండిపోయినయో లేదో మీ కండ్ల కట్టినట్టు వాస్తవాలు చూపెడతామని సవాల్ విసిరారు. ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యతాయుతంగా మాట్లాడాలని అడిగిన ప్రతిపక్ష నాయకుల పైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. కరెంటు రావడం లేదని రైతులే సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే కనబడడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జిల్లా ఉన్నత అధికారులు స్పందించి మిగిలిన కాస్త పంటలకైనా సకలంలో 12 నాణ్యమైన కరెంటు మరియు కాలవల ద్వారా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

