Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Chapri First Look | ‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ కుమార్, తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Chapri First Look | ‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ కుమార్, తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఛప్రి’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి అన్ని ప్రధాన విభాగాలను సరోజ్ కుమార్ తానే స్వయంగా చూడడం విశేషం. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్, సంగీతం మరియు దర్శకత్వం వంటి సమస్త బాధ్యతలను ఆయనే నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సరోజ్‌తో పాటు ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఒక స్లమ్‌లో ఉండే సాధారణ కుర్రాడి ప్రేమ ప్రయాణం, ఆ ప్రయాణంలో డబ్బున్న వ్యక్తుల వల్ల అతని జీవితంలో ఎదురయ్యే ఊహించని పరిణామాలు, ఈ క్రమంలో అతని ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ‘ఛప్రి’ సినిమాను రూపొందించారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో సరోజ్ రా అండ్ రస్టిక్ లుక్‌లో, పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడి గెటప్‌లో ఉన్న ఆయన ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి రమేష్ మర్రెపల్లి సినిమాటోగ్రఫీ అందించగా, నాని దేవరపల్లి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

