Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
Tyson Naidu | ప్రోమిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’.
Tyson Naidu | ప్రోమిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మునుపెన్నడూ చూడని రీతిలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభిస్తూ మొదటి పాట ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను విడుదల చేశారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ ఫోక్ నంబర్ ఇన్ఫెక్షియస్ రిథమ్స్, ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్‌తో శ్రోతలను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటోంది. పల్లెటూరి వాతావరణం, మాస్ బీట్స్‌ను కలగలిపి స్వరాలు సమకూర్చడంలో తనదైన మార్క్ చూపించే భీమ్స్, ఈ పాటను మరింత హై-ఎనర్జీతో తీర్చిదిద్దారు. సురేష్ గంగుల రాసిన లిరిక్స్ పాటకు వినోదాత్మకమైన మాస్ ఫ్లేవర్‌ను జోడించాయి. హీరో తన ప్రేమను వ్యక్తపరుస్తూ కథానాయికను ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అని ముద్దుగా పిలవడం, దానికి ఆమె చమత్కారంగా ఇచ్చే కౌంటర్ల మధ్య సాగే రొమాంటిక్ సంభాషణలు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ తమ పవర్ఫుల్ వాయిస్‌తో ఈ పాటకి అదనపు జోష్‌ను అందించారు. పాటలోని విజువల్స్ కూడా ఎంతో కలర్ఫుల్గా, ఐ-ఫీస్ట్‌గా రూపుదిద్దుకున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ఫోక్ ఇన్స్పైర్డ్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతూ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీలో సాయి శ్రీనివాస్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో రచ్చ చేయగా, నేహా శెట్టి కూడా ఆయనకు సరిసమానంగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కేమిస్ట్రీ ఈ పాటను విజువల్ ట్రీట్‌గా మార్చింది. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, కలర్‌ఫుల్ సెట్స్ పాటలో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ముకేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అవినాష్ కొల్లా మరియు కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

