AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
Anaswara Rajan | అక్కినేని నాగార్జున సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు.
Anaswara Rajan | అక్కినేని నాగార్జున సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, చిత్రంలో కీర్తి పాత్రలో నటించిన హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు పూర్తిగా మీకోసం…
తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న అనస్వర రాజన్, ‘ఇట్లు అర్జున’ చిత్రంలో నటించడం తనకు దక్కిన అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నారు. ఈ సినిమా తాను తెలుగులో సైన్ చేసిన తొలి ప్రాజెక్ట్ అని, అయితే వేరే సినిమా ముందుగా విడుదలైనప్పటికీ ‘ఇట్లు అర్జున’ తన కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలిపారు. ఈ చిత్రంలో తాను పోషించిన ‘కీర్తి’ పాత్ర చాలా యూత్‌ఫుల్‌గా, ఎంతో ఇన్నోసెంట్‌గా ఉంటుందని చెప్పారు. కథ విన్నప్పుడే ఈ క్యారెక్టర్‌తో తాను పూర్తిగా కనెక్ట్ అయ్యానని, ప్రతి యువతి ఈ పాత్రలో తమను తాము చూసుకునేలా ఉంటుందని ఆమె వివరించారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు.
సినిమాలో హీరో పాత్ర ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, అర్జున్ పాత్రకు మాటలు ఉండవని, ఇలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్‌తో తెరపై రావడం చాలా అరుదు అని చెప్పారు. ఈ సినిమా కోసం హీరో అనీష్‌తో కలిసి ప్రత్యేక వర్క్‌షాప్స్‌లో పాల్గొని, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేసినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద అద్భుతంగా పండిందని, ప్రేక్షకులు దీనిని కచ్చితంగా ఆస్వాదిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, మాటలు లేని హీరో తన ప్రేమను ఎంత తీవ్రంగా వ్యక్తంచేస్తాడనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆమె తెలిపారు.
దర్శకుడు మహేష్ ఉప్పల విజన్ గురించి చెబుతూ, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఆయనేనని అనస్వర ప్రశంసించారు. అర్జున్, కీర్తి పాత్రలను ఆయన ఎంతో హృద్యంగా తీర్చిదిద్దారని, పాత్రల చిత్రణపై ఆయనకు ఉన్న పూర్తి స్పష్టత తన పనిని మరింత సులభం చేసిందని చెప్పారు. డైరెక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఎంతో ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు.
మొదటి సినిమాతోనే మూగవాడి పాత్రను ఎంచుకోవడం హీరో అనీష్ చేసిన గొప్ప సాహసమని, ఈ డేరింగ్ స్టెప్‌కు ఆయనను అభినందించాలని అన్నారు. సినిమా కోసం అనీష్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుందని, తన యాక్షన్ మరియు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటాడని చెప్పారు.
ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున గారు సమర్పకులుగా వ్యవహరించడం తమ మొత్తం టీమ్‌కు కొండంత బలాన్నిచ్చిందని అనస్వర ఆనందం వ్యక్తం చేశారు. తాను తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ సినిమా కావడం, హీరో అనీష్‌కు, నిర్మాత వెంకీ కుడుములకు ఇది తొలి సినిమా కావడంతో, నాగార్జున గారి సపోర్ట్ తమ అందరికీ ఒక మెమొరబుల్ జర్నీని అందించిందని తెలిపారు. నిర్మాత వెంకీ కుడుముల స్వయంగా దర్శకుడు కావడంతో ప్రతి అంశాన్ని ఎంతో సున్నితంగా అర్థం చేసుకుని మంచి సపోర్ట్ అందించారని కొనియాడారు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి చెబుతూ, ఆయన ఎప్పుడూ ఎంతో పాజిటివ్‌గా ఉంటారని, సెట్స్‌లో ఆయన ఉంటే వాతావరణం చాలా ఉల్లాసంగా మారుతుందని చెప్పారు. ప్రమోషన్స్‌లోనూ థమన్ అందించిన సహకారం మరువలేనిదని, ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఆయన సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచిందని తెలిపారు.
తెలుగులో వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లలో అవకాశాలు రావడంపై స్పందిస్తూ, చిరంజీవి గారి ‘కాకా’, రవితేజ గారి ‘తులాభారం’తో పాటు సంగీత్ శోభన్ సినిమాలో నటిస్తున్నానని వెల్లడించారు. చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకెంతో గర్వకారణమని, ఆయన ఒక గ్రేట్ యాక్టర్ మాత్రమే కాకుండా అద్భుతమైన మానవతావాది అని, ఆయన నుండి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నానని ఆనందంగా చెప్పారు.
చివరిగా, ‘ఇట్లు అర్జున’ ప్రేక్షకులకు అందించే అనుభూతి గురించి చెబుతూ, ఇందులో ప్రేమతో పాటు ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు అన్నీ సమిళితమై ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని, దీపావళి పండుగను ‘ఇట్లు అర్జున’ విజయంతో అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

