Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
Man Catches Employee With Daughter | చిన్న ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగికి, యజమాని కుమార్తెతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న అతడిని యజమాని పట్టుకున్నాడు. గదిలో నిర్బంధించి పలు గంటలపాటు బ్యాట్‌తో కొట్టి చంపాడు.
బెంగళూరు: చిన్న ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగికి, యజమాని కుమార్తెతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న అతడిని యజమాని పట్టుకున్నాడు. గదిలో నిర్బంధించి పలు గంటలపాటు బ్యాట్‌తో కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man Catches Employee With Daughter) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఆనంద్ రాజ్, గత కొన్నేళ్లుగా బెంగళూరులో స్వీట్ కార్న్ మెషిన్ తయారు చేసే ఒక చిన్న కర్మాగారాన్ని నడుపుతున్నాడు. సుమారు రెండేళ్ల కింద కేరళకు చెందిన కిరణ్‌ను పనిలో చేర్చుకున్నాడు.
కాగా, ఆనంద్ రాజ్ కుమార్తె మైసూరులో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటున్నది. దసరా సెలవుల కోసం ఆమె ఇంటికి వచ్చింది. ఈ సమయంలో కిరణ్‌తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ విషయం తెలిసి ఆనంద్ రాజ్ అసంతృప్తిగా ఉన్నాడు.
మరోవైపు నవంబర్ 2న భార్యతో కలిసి తమిళనాడులోని తన స్వగ్రామానికి వెళ్తున్నానని ఆనంద్ రాజ్ తన కుమార్తెకు చెప్పాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం తన భార్యతో కలిసి యలహంకలోని ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో కుమార్తెతో కలిసి కిరణ్ ఒక గదిలో ఉండటాన్ని ఆనంద్ రాజ్ చూశాడు. ఆగ్రహించిన అతడు ఇంట్లో ఉన్న గదిలో అతడ్ని బంధించాడు. భార్య, కుమార్తెను చిక్కబళ్లాపురంలోని బంధువు ఇంటికి పంపాడు.
ఆ తర్వాత ఆనంద్ రాజ్ తన ఇంట్లో బంధించిన కిరణ్‌ను రాత్రంతా బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాడు. మరుసటి రోజు మధ్యాహ్నం అతడి కడుపు కింది భాగంలో తన్నడంతో కిరణ్ కుప్పకూలిపోయాడు. ఆనంద్ రాజ్ ఆటోలో ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కిరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యజమాని ఆనంద్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగి కిరణ్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

