చౌటుప్పల్, జూన్ 04 : కుమ్మరి వృత్తిదారులకు ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో వృత్తిదారులు చేస్తున్న కుండల పరిశ్రమను ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మాట్లాడుతూ వృత్తిదారులకు స్థలాలు లేవని, ప్రతి గ్రామంలో రెండు ఎకరాల భూమి కేటాయించాలన్నారు.
ప్రస్తుత సమాజ పోకడలకు తగట్టు యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆధునీకరణ మట్టి పరికరాలు తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. వృత్తిదారులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్‌రెడ్డి, నాయకులు రొండి నర్సింహ్మ, టంగుటూరి రాములు, ఎస్ఏ రహమాన్, దాసరి అంజయ్య పాల్గొన్నారు.