మునుగోడు, ఏప్రిల్ 23 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంతా కృషి చేయాలని హెచ్ఎం నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం పాఠశాల నుండి గురుకుల పాఠశాలకు ఎంపికైన ముగ్గురు విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే విద్యా సంవత్సరంలో (2025-26) విద్యార్థుల సంఖ్య పెంపునకు అంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాదగోని రాజేశ్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయురాలు ఆయేషా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.