దేవరకొండ రూరల్, మే 30 : దేవరకొండ నియోజవర్గ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో గల దొంతినేని సంపత్ అమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి సమిచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మారుపాకుల అరుణా సురేశ్‌గౌడ్, కొండభీమనపల్లి మాజీ సర్పంచ్ మునుకుంట్ల విద్యావతి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Devarakonda Rural : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి : ఎమ్మెల్యే బాలునాయక్