చిట్యాల, ఫిబ్రవరి 22 : బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. మండలంలోని పెద్దకాపర్తి బీఆర్ఎస్ నాయకుడు పొట్లపల్లి స్వామి ఆధ్వర్యంలో గుండోజు రమేశ్, దొడ్డి నరేశ్, రాపోలు శ్యాం, రాపోలు చందు, రాపోలు రాజు, ఎడ్ల శివ, బత్తుల సాయికిరణ్, గుండెపూరి సాయి, అశోక్, ఈశ్వర్, శేఖర్‌తో పాటు 50మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో బుధవారం చేరారు.
ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. దుర్మార్గమైన బీజేపీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, గ్రామ సర్పంచ్ మర్రి జలేంధర్‌రెడ్డి, ఎంపీటీసీ ముద్దసాని నీతారమణారెడ్డి పాల్గొన్నారు.