భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 5 : మండలంలోని కనుముకుల గ్రామంలో మూతపడిన చేనేత పారును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 2008లో కేంద్ర ప్రభుత్వం సీం ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పారుల పథకం కింద దేశవ్యాప్తంగా 26 టెక్స్టైల్ పారులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భూదాన్‌పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామంలో 22 ఎకరాల విస్తీర్ణంలో చేనేత పారును ఏర్పాటు చేశారు. రూ.47 కోట్ల వ్యయంతో 15 మంది ప్రమోటర్లు కలిసి పార్కును నిర్మించారు. ప్రాజెక్టులో ప్రమోటర్ల వాటాతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా వరింగ్ క్యాపిటల్ కాకుండా ఎన్‌హెచ్‌డీసీకి కేంద్రం చెల్లించింది. దాంతో పారు నిర్వహణకు వివిధ బ్యాంకుల నుంచి రూ.12.60 కోట్ల రుణం తీసుకున్నారు. బ్యాంకులకు బకాయిలు చెల్లించకపోవడంతో గత ఏడాది పారును సీజ్ చేశారు. అప్పుల భారంతో మూతపడడంతో పారును వేలం వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పారును దక్కించుకున్నది. గతంలో చేనేత పారులో 1200 మంది కార్మికులకు ఉపాధి కలిగేది. క్రమక్రమేనా ఆ సంఖ్య 200 మందికి తగ్గింది. మారెట్ లేకపోవడం, బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో పారును సీజ్ చేయడంతో కార్మికులు వీధినపడ్డారు. 15 ఏండ్ల క్రితం చేనేత పారును నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించినప్పుడు 5వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కానీ, అది నెరవేరలేదు. మూతపడిన పారును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తే పూర్వ వైభవం వస్తుందని చేనేత కార్మికులు ఎదురుచూస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
భూదాన్‌పోచంపల్లి : కనుముకుల గ్రామంలో చేనేత పారును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై భూదాన్‌పోచంపల్లి బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్లెక్సీకి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేనేత పారును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి కార్మికులకు పని కల్పించాలని కోరారు. పార్కును పునరుద్ధరిస్తే 2వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, పద్మశాలి మహా జన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, కౌన్సిలర్లు దేవరాయకుమార్, కుడికాల అఖిలాబలరాం, బీఆర్ఎస్ మండల, పట్టణ, అధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిలువేరు బాలనరసింహ, గునిగంటి మల్లేశం, సీత శ్రవణ్, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు అంకం పాండు, మారెట్ డైరెక్టర్లు దొడ్డమోని చంద్రం, కుంటోళ్ల మహేశ్, నాయకులు అంకం యాదగిరి, చింతకింది కిరణ్, రుద్ర చెన్నకేశవులు, దోర్నాల గణేశ్, కొమ్ము శ్యాం, కటకం శ్యాంసుందర్, గిరి, ప్రవీణ్, బాలనరసింహ, రాజమణి పాల్గొన్నారు.
చేనేత పార్కు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు..
ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడ్డ చేనేత పార్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అన్నివిధాలా ఆధునీకరించి కార్మికుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగనున్నది. రానున్న రోజుల్లో వేలాదిమంది చేనేత కార్మికులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టనున్నది. చేనేత పార్కుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.