భువనగిరి అర్బన్, ఆగస్టు 19: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రెండున్నరేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొం గిడి సునీతా మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమ లు కోరుతూ బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలోని అమరవీరుల స్థూ పం వద్ద బుధవారం నిర్వహించిన ధర్నా లో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రె స్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈ నెల 29న కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిర్వహించే ధర్నాలోగా ప్రభుత్వం స్పందించాలన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని, అవసరమై తే ధర్నాలు, దీక్షల్లో కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరిగేంతవరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఉద్యోగులు ఇబ్బం దులు పడుతుంటే బీఆర్ఎస్ ఊరుకోదని, వారి వెంటే ఉంటామన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ 5 లక్ష ల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే కేవలం 3 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకే ఒకటో తేదీన జీతాలు వస్తున్నాయని, మరో 5 లక్షల మంది కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు మూడు నెలలకో, ఆరు నెలలకోసారి జీతా లు వస్తున్నాయన్నారు. వారికి కూడా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, భువనగిరి పట్టణ, మండల అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, జనగాం పాం డు, నాయకులు అతికం లక్ష్మీనారాయణ, కేశవపట్నం రమేశ్, రిటైర్డ్ ఉద్యోగులు శెట్టి బాలయ్య, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు ఉద్యోగులు కాదని.. ఉద్యమకారులని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భువనగిరి ఖిల్లా నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమం వెనకడుగు వేయలేదని, బీఆర్ఎస్, కేటీఆర్ సూచనల మేరకు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి.. ఉద్యోగుల హకులు సాధిస్తామన్నారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చి వేతల మీద ఉన్న శ్రద్ధ పాలన మీద, ప్రజల మీద, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల మీద లేదన్నారు.