యాదగిరిగుట్ట, మార్చి10 : డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిని యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లకుండా ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొండపైన ఈఓ చేపడుతున్న విధానాలకు నిరసనగా ఆలయ సందర్శనలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి వినతిపత్రం అందించేందుకు డీసీసీబీ మాజీ చైర్మన్ ప్రయత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ గొంగడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కలిసి వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోతామని చెప్పినా అడ్డుకున్నట్లు చెప్పారు. స్వామివారి కల్యాణంలోనూ ప్రోటోకాల్ సైతం పాటించలేదని పేర్కొన్నారు.