కట్టంగూర్, జనవరి 14 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భోగి పర్వదినాన్ని పురష్కరించుకుని కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ గోదా రంగనాయక స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాసశర్మ, రామడుగు అశ్విన్ కార్తీక్ ఆధ్వర్యంలో సుదర్శన హోమం, ఉత్సవ విగ్రహాలు, అభిషేకం, కల్యాణ మహోత్సంతో పాటు వేద మంత్రచరణాల మధ్య కల్యాణ తంతును జరిపించారు.
ఇల్లెందుల కృష్ణమూర్తి మణెమ్మ, కొంపెల్లి లక్ష్మయ్య మంగమ్మ, కొంపెల్లి సైదులు సుజాత, బుడిగ సైదులు అనూష, రెడ్డిపల్లి సైదులు సైదమ్మ దంపతులు కల్యాణ తంతులో కూర్చొని క్రతువు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి రమేశ్, కోమటి భాస్కర్, రుద్రాభట్ల జితేందర్ శర్మ, బండారు అరుణ గుప్తా, కాపుగంటి నరేశ్, బత్తిని సత్తయ్య, ఇల్లెందుల రాంమూర్తి, మీలా వేణుమాధవ్, మేడి విజయ్, కొల్లూరి శివ, శ్రీరామ సంధ్య వీరేశ్, కడవేరు కృష్ణవేణి, సంధ్యమ్మ, కొత్త శోభ, గుడిపాటి పద్మ, మూడుదుడ్ల అండాలు, గుండు రూప పాల్గొన్నారు.

Kattangur : ఘనంగా గోదాదేవి కల్యాణం