నీలగిరి, ఏప్రిల్ 09 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బాలిక (9) పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ అఘాయిత్యంపై బాధితురాలి తల్లి నల్లగొండ బాలల సంరక్షణ కేంద్రంలో ఫిర్యాదు చేయగా అధికారులు బాలిక స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు నిందితుడిపై పోక్స్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని రక్షించేందుకు మిర్యాలగూడకు చెందిన బడా రాజకీయ నాయకులు శత విధాల ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఎస్పీ సీరియస్ యాక్షన్తో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.