కట్టంగూర్, జూలై 17 : కల్లుగీత కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 2 నుండి 18 వరకు నిర్వహించనున్న గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దండెంపల్లి శ్రీనివాస్ పిలునిచ్చారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో కల్లుగీత కార్మికలతో కలిసి యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, గీత కార్మికులకు పింఛన్ రూ.4 వేలు, ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు వనస యాదయ్య, గౌడ సొసైటీ అధ్యక్షుడు బందారపు అచ్చాలు, నాయకులు వెంకన్న, సత్తయ్య, నగేష్, రామస్వామి, స్వామి, నర్సింహ్మరాజు, చంద్రయ్య, రాజేష్ పాల్గొన్నారు.