తుంగతుర్తి, జూన్ 06 : తుంగతుర్తి మండల కేంద్రంలోని గ్రంథాలయ చైర్మన్ గా వీరబోయిన గంగరాజు యాదవ్ నియమాకమయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గంగరాజు యాదవ్ మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రేగటి రవి, దాసరి శ్రీను, కలకోట్ల మల్లేష్, మాచర్ల అనిల్, కొండ రాజు పాల్గొన్నారు.