చండూరు, మే 03 : నిరుపేదలను ఆదుకునేందుకే గాంధీజీ ఫౌండేషన్ను స్థాపించినట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ తెలిపారు. “నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ” కార్యక్రమాన్ని శనివారం స్థానిక గాంధీజీ విద్యాసంస్థల యందు తమ కుటుంబ సభ్యులతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమన్నారు. అలాగే గాంధీజీ విద్యాసంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, కోడి ప్రీతి, కోడి శృతి, జెల్ల వివేక్, జెల్ల ధీరజ్, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి పాల్గొన్నారు.