తుంగతుర్తి, ఏప్రిల్ 13: బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వ పాలనలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రజతోత్సవ సభ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
ఈ నెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గుండగాని రాములు గౌడ్, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, గోపాల్‌రెడ్డి, గాజుల యాదగిరి, సత్యనారాయణ, మట్టిపల్లి వెంకట్, బొంకురి శ్యాంసుందర్ పాల్గొన్నారు.