తుంగతుర్తి, మే 19 : తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.29 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిధులు మంజూరు చేసి నిలిచిపోవడంతో మళ్లీ టెండర్ చేసి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం, ప్రభుత్వానికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుమారస్వామి, భాషబోయిన వేణు రాజ్, మల్లెపాక రవి పాల్గొన్నారు.