చందంపేట, ఆగస్టు 22 : వర్షాలు కురవాలని కోరుతూ చందంపేట మండలంలోని రేకులగడ్డ గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో కప్ప కావడి ఆడారు. ప్రతి ఇంటికి వెళ్లి కప్పతో ఉన్న వేప ఆకుల తోరణంలో కప్పకు నీళ్లు పోసి వానలు కురవాలి దేవుడా.. వానలు కురవాలి దేవుడా అని పూజలు నిర్యహించారు. ఈ కార్యక్రమంలో రైతులు కాశయ్య, అంజయ్య, ఆంజనేయులు, హనుమంతు, వెంకటయ్య, దానయ్య, రాజ్, జగన్, ఈశ్వర్ పాల్గొన్నారు.

వర్షాలు కురవాలని రేకులగడ్డలో కప్ప కావడి